వెలుగు దారులు
గత దశాబ్దకాలంగా, ఆధ్యాత్మికాన్వేషకులకు, జిజ్ఞాసువులకు రచయిత ఇచ్చిన మార్మిక సూచనలు మరియు సాధనా ఉపదేశముల సమాహారమే ఈ పుస్తకం. ఇది 360 వ్యాసములుగా విభజింపబడింది. సాధనామార్గంలో నడుస్తున్న ఒక సాధకుడు తెలుసుకోవలసిన ఆచరణాత్మకమైన సమస్త సమాచారమూ దీనిలో మీకు లభిస్తుంది.
ప్రతిచోటా పుట్టగొడుగులలాగా వెలుస్తున్న అనేకమంది గురువులూ, వారి వారి కపోల కల్పితములైన సిద్ధాంతములను సనాతనధర్మంగా ప్రచారం చేసుకోవడమూ, ఆధ్యాత్మిక రంగంలో గొప్ప గందరగోళాన్ని సృష్టించాయి. ఈ క్రమంలో పురాతన సాంప్రదాయాలైన వేదాంతము, యోగము, తంత్రముల నుండి ఎవరి ఇష్టానుసారం వారు విషయాలను తీసుకుంటున్నారు. కానీ, వాటిని సరిగ్గా వివరించడమూ లేదు, దీనిని ఫలానా చోటనుంచి తీసుకున్నామని చెప్పడమూ లేదు. వీటిని చదివినవారు అయోమయానికి గురై, తప్పుదారిన పడుతున్నారు. కనుక, ఆధ్యాత్మిక సాధనామార్గాన్నీ, దానిలోని లోతుపాతులనూ స్పష్టంగా వివరించవలసిన ఆధ్యాత్మిక అవసరం నేడు ఎంతైనా ఉన్నది.
భారతదేశపు ఆధ్యాత్మికజ్ఞానమంతా, అతి సులభమైన మాటలలో ఈ పుస్తకంలో వివరింపబడింది. ఇది, వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, మరియు మార్మికశాస్త్రముల లోతుపాతులను, ప్రాచీనులూ నవీనులూ అయిన మహనీయుల బోధలకు అనుగుణంగా, నిత్యజీవితానికి అన్వయిస్తూ, చక్కగా చెప్పబడింది.